నయనతార ‘కోకోకోకిల’ ట్రైలర్…

Nayanathara Ko Kokila Trailer

సినిమా: కోకోకోకిల

నటీనటులు: నయనతార, యోగి బాబు, శరణ్య తదితరులు

దర్శకుడు: నెల్సన్

సంగీత దర్శకుడు: అనిరుద్ద్ రవిచందర్

నిర్మాత: లైకా ప్రొడక్షన్స్

కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల నుండి కథానాయికే ముఖ్య పాత్రగా సినిమాలు రావడం మొదలు పెట్టాయి. అయితే, కొత్త హీరోయిన్స్ అందరూ హీరోల పక్కన జంటగా చేస్తూ బిజీగా ఉంటే పాత హీరొయిన్స్ అటు ఆ సినిమాలతో పాటు ఇటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు. అయితే, అనుష్క, నయనతార, త్రిష ఆ జాబితాలో ముందు వరసలో ఉన్నారనే చెప్పాలి. ఇప్పుడు నయనతార తానే లీడ్ రోల్ చేస్తూ మరో సినిమాతో సిద్ధంగా ఉంది. అదే, కోకోకోకిల… ట్రైలర్ చూస్తే ఇది స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే కథలా ఉంది. లైకా ప్రొడక్షన్స్ లాంటి  బ్యానర్ లో ఈ సినిమా రావడం కొంచెం అంచనాలను రేకెత్తిస్తుంది. ఇలాంటి భిన్నమైన కథతో వస్తున్న నయనతార హిట్ కొడుతుందో లేదో చూడాలి ఇక… ఈ సినిమా ఆగష్టు 17వ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.