‘జైసింహా’ ప్రివ్యూ…

Jai Simha Preview
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నటీనటులు :   బాలకృష్ణ , నయనతార , నటాషా దోషి, హరి ప్రియ…
నిర్మాత:  సి. కళ్యాణ్ 
దర్శకత్వం :  కె.ఎస్. రవికుమార్ 
సినిమాటోగ్రఫీ:  సి. రామ్ ప్రసాద్ 
ఎడిటర్ :  ప్రవీణ్ ఆంటోనీ 
మ్యూజిక్ :  చిరంతన్ భట్ 

 

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జైసింహా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాతో బాలయ్య సంక్రాంతి విజేతగా నిలిచేందుకు తాపత్రయ పడుతున్నాడు. గత సంవత్సరం సంక్రాంతికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో బాలకృష్ణ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మరోసారి సక్సెస్‌ను దక్కించుకుని సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో సంక్రాంతి బాలయ్య పలు సినిమాలతో వచ్చి విజయాలను దక్కించుకున్నాడు. అందుకే ఈ సంవత్సరం పవన్‌ మూవీ ఉందని కూడా చూడకుండా బాలయ్య జైసింహాతో బరిలోకి దిగబోతున్నాడు.

బాలయ్య 102వ చిత్రంగా తెరకెక్కిన జైసింహా చిత్రం చాలా ప్రత్యేకం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలకృష్ణ గతంలో ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల్లో డబుల్‌ యాక్షన్‌ చేశాడు, ఆ సినిమాల్లో బాలయ్య చాలా పవర్‌ ఫుల్‌ పాత్రను చేశాడు. అలాగే జైసింహాలో కూడా బాలయ్య పవర్‌ ఏంటో ట్రైలర్‌లో తేలిపోయింది. కనుక సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో నిలిచిపోయే సినిమాగా, కలెక్షన్స్‌ పరంగా కూడా బాలయ్య కెరీర్‌లో నెం.1 చిత్రంగా నిలుస్తుందనే ధీమాను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదలైన అజ్ఞాతవాసికి నెగటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాకు కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.