ఇక రాజ్‌ తరుణ్‌ ఏం చేస్తాడో?

Rangula Ratnam Movie release details

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మరియు ‘జైసింహా’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. డబ్బింగ్‌ చిత్రం ‘గ్యాంగ్‌’ కాస్త పర్వాలేదు అనిపించింది. అత్యధిక అంచనాలున్న పవన్‌ మూవీ అజ్ఞాతవాసి 150 కోట్లు వసూళ్లు సాధిస్తుందని భావించగా ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 50 కోట్లు అయినా సాధిస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. ఇక జైసింహా పరిస్థితి కూడా దాదాపు అదే మాదిరిగా ఉంది. గ్యాంగ్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా అదో డబ్బింగ్‌ చిత్రం అవ్వడం వల్ల పెద్దగా కలెక్షన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. గత సంవత్సరం సంక్రాంతికి ఖైదీ నెం. 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానంభవతి చిత్రాలు విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఈసారి మాత్రం సంక్రాంతి సీజన్‌కు వచ్చిన మూడు సినిమాల్లో ఏ ఒక్కటి గౌరవ ప్రధమైన కలెక్షన్స్‌ను రాబట్టలేదు అని తేలిపోయింది. ఇప్పటి వరకు విడుదలైన మూడు చిత్రాలు కలిపి కూడా చిరంజీవి 150వ చిత్రం సాధించిన వసూళ్ల స్థాయిలో సాధించలేక పోయాయి. ఇక సంక్రాంతి సీజన్‌లో మిగిలి ఉన్న ఒకే ఒక్క చిత్రం రంగుల రాట్నం. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రంగుల రాట్నంకు మంచి ఛాన్స్‌. ఇప్పటికే విడుదలైన చిత్రాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న నేపథ్యంలో రంగులరాట్నం చిత్రం కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఒక మోస్తరు సక్సెస్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా మంచి కలెక్షన్స్‌ను సాధించే అవకాశం ఉంటుంది. సంక్రాంతి సీజన్‌ వృదా కాకుండా ఉండాలి అంటే కనీసం ఈ చిత్రం అయినా సక్సెస్‌ అవ్వాలని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. మరి రాజ్‌ తరుణ్‌ సక్సెస్‌ను సాధించి సంక్రాంతి విజేతగా నిలుస్తాడా అనేది చూడాలి. నాగార్జున నిర్మించిన చిత్రం అవ్వడంతో అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.