జైసింహా సీన్ మీద మహీంద్రా ఛైర్మన్ కామెంట్.

Anand Mahindra Tweets On Jai Simha Movie Bolero Scene

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒక్కో సారి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద వాళ్ళ దృష్టికి వెళతాయి. వాళ్ళు కూడా అందులోని పరమార్ధం గుర్తించి సరిగా స్పందిస్తారు. ఇప్పుడు నటసింహం బాలయ్య హీరోగా చేసిన జైసింహా సినిమా విషయంలోనూ అలాగే జరిగింది. అందులోని ఓ సీన్ ఏకంగా మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్ళింది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే …

జైసింహా లో ఓ పోలీస్ వాహనాన్ని ( బొలెరో ) బాలయ్య క్యారెక్టర్ ఒంటి చేతితో పైకి లేపుతుంది. ఈ సీన్ ని ఓ నెటిజెన్ ఆనంద్ మహీంద్రాకు టాగ్ చేశారు. ఈ సీన్ చూసి నవ్వుకున్న ఆనంద్ మహీంద్రా దానిపై సరదాగా ఓ కామెంట్ పోస్ట్ చేశారు. “ హా హా… బొలెరో వాహనాలు చెక్ చేయడానికి ఇకపై మా సర్వీసింగ్ సెంటర్స్ లో హైడ్రాలిక్ లిఫ్ట్ లు వాడే పనిలేదు” అని ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతోంది.

Anand Mahindra Tweets On Jai Simha