టాక్‌తో సంబంధం లేకుండా ఓవర్సీస్‌ కలెక్షన్స్‌

agnathavasi movie collections
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో భారీ ఎత్తున విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది. సినిమాకు మొదటి షో నుండే నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మెగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు అజ్ఞాతవాసి చిత్రాన్ని విరగబడి చూస్తున్నారు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన అజ్ఞాతవాసి చిత్రం ఓవర్సీస్‌లో కొత్త రికార్డులను నమోదు చేసింది. దాదాపు 500లకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం ప్రీమియర్‌ షోల ద్వారానే మిలియన్‌ మార్క్‌ను చేరుకుంది. మొదటి రోజు మొత్తంగా కలిసి 1.5 మిలియన్‌ డాలర్లను ఈ చిత్రం సాధించింది అంటూ ట్రేడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవలు మరియు ఇరత్ర కారణాల వల్ల సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే 25 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం దాటిందని మరో రెండు మూడు రోజులు ఇదే ఊపు కొనసాగితే ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్‌ ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు అంటున్నారు. అయితే సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో పాటు, రేపు ‘జైసింహా’ విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం వంద కోట్ల మార్క్‌ను అందుకుంటుందా అనేది అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాని పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం సినిమా టాక్‌తో సంబంధం లేకుండా, రివ్యూలతో పని లేకుండా ఈజీగా 100 కోట్లను పవన్‌ సాధిస్తాడని, అది పవన్‌కు చాలా సింపుల్‌ అంటూ నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న జైసింహా ఫలితం ఎలా ఉంటుందో చూసి, ఆ తర్వాత అజ్ఞాతవాసి కలెక్షన్స్‌ను అంచనా వేయవచ్చు అంటూ మరి కొందరు అంటున్నారు.