మోహిని మూవీ రివ్యూ… తెలుగు బులెట్

Mohini Movie Review

నటీ నటులు : త్రిష , జాకీ భగ్నానీ తదితరులు
సినిమాటోగ్రఫీ : ఆర్.బి.గురుదేవ్
మ్యూజిక్ : వివేక్ మెర్విన్
రచన – దర్శకత్వం : రమణ మాదేష్

గత కొన్నాళ్ళగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతోన్న త్రిష మెయిన్ లీడ్ గా మోహిని అనే హారర్ థ్రిల్లర్ ఈరోజు విడుదలయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది లేట్ గా వచ్చిన ఈ సినిమా కేవలం త్రిష లుక్స్ వల్లనే హైప్ వచ్చిందంటే నమ్మడం కష్టం, కానీ కేవలం త్రిష వల్లే సినిమాకు కాస్త హైప్ వచ్చింది. ఈ సినిమాతో అయినా త్రిష మళ్ళీ ఫాం లోకి వస్తుందని భావించిన వారికి ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇచ్చిందనేది పూర్తి సమీక్షలో తెలుసుకుందాం.

మోహిని ఎవరు ?

హైదరాబాద్ లో ఒక ఫేమస్ బ్యాకరీ నడుపుతున్న వైష్ణవి(త్రిష) తన స్నేహితురాలి పెళ్లి చేయడం కోసం లండన్ వెళ్ళాల్సి వస్తుంది. అయితే లండన్ వెళ్లి అక్కడ ఒక బ్యాకరీలో జాయిన్ అయిన ఆమెకి అక్కడ ఒక యువకుడు పరిచయం అవుతాడు, ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఈ క్రమంలో త్రిషకి, ఆమెతో కూడా ఉన్న తన స్నేహితులకి దెయ్యం కనపడుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో త్రిషని ఆ దెయ్యం ఆవహిస్తుంది. అయితే ఆవహించిన ఆ దెయ్యం పేరే మోహిని. అయితే అసలు ఆ దెయ్యం వైష్ణవినే ఎందుకు ఆవహిస్తుంది ? ఆవహించి ఏమి చేసింది ? అనేదే స్టోరీ.

మోహినీ ఎలా ఉందంటే :

చాలా రోజుల తరువాత త్రిష మెయిన్ లీడ్లో నటిస్తున్న సినిమా అంటే సాధారణంగా ప్రేక్షకులకి కొన్ని అంచనాలు ఉంటాయి. ఇంతకు ముందు నాయకి, కలావతి వంటి హారర్ బ్యాక్ డ్రాప్ సినిమలు చేసినా అవి ఆమెకి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. అయితే ఈరోజు విడుదల అయిన మోహిని చిత్రం కూడా త్రిషకి పెద్దగా పేరు తెచ్చిపెట్టదు అనుకోవాలి. ఎందుకంటే సినిమా తమిళ అనువాదమ అయినందువల్ల పూర్తిగా ఆర్ ఆర్ వైఫ్యల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. అలాగే సినిమా చాలా రిచ్ గా తీయాలని ప్రయత్నించినా చాలా చోట్లా జనరల్ లాజిక్స్ మిస్ అవడంతో సినిమాకి ఎందుకోచ్చామా ? అని సగటు ప్రేక్షకుడు తల బాదుకోవడం కనిపించింది. ఇక పాటల సంగతి సరే సరి, ప్రేక్షకులని అసలు ఆకట్టుకోలేదు. ఇక ప్రేక్షకులని అలరించే విషయం ఏమన్నా ఉందంటే అది సినిమాలో దెయ్యం కనిపించిన కాసేపు మాత్రమె. దర్శకుడు ఎంచుకున్న సబ్జెక్ట్ కాసులు కురిపించేదే అయినా ఎందుకో ఈ ప్రయత్నం మాత్రం బెడిసి కొట్టింది.

త్రిష నటన ఎప్పటిలానే బాగుంది. ఇక మిగతా నటులు సురేష్, జాకీ, మధుమిత ఇలా ఎవరికివారు తమ తమ పరిధులలో నటించారు. సినిమాలో పాటలు తమిళ వాసన ఎక్కువ ఉండటంతో తెలుగువారికి నచ్చకపోవచ్చు. ఇక సినిమాకి ఆర్ ఆర్ ప్రాణం కానీ అలంటి ఆర్ ఆర్ ని చెడకోట్టడంతో సినిమా మొత్తానికి ఆ అఫెక్ట్ పడింది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : మోహిని… భయపెట్టదు… ఇబ్బంది పెడుతుంది

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2 / 5