కర్తవ్యం మూవీ రివ్యూ… తెలుగు బులెట్

karthavyam Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  న‌య‌న‌తార‌, విఘ్నేశ్‌, రామ‌చంద్ర‌న్ దురైరాజ్‌, సును ల‌క్ష్మి, మ‌హాల‌క్ష్మి
నిర్మాతలు :     శ‌ర‌త్ మ‌రార్‌, ఆర్‌.ర‌వీంద్ర‌న్‌
దర్శకత్వం :  గోపీ నైనర్‌
మ్యూజిక్ :  జిబ్రాన్‌

ప్రస్తుతం అగ్ర హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు అదేవిధంగా నయనతార కూడా నటిస్తుంది. ఈ మధ్య నయనతార లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో వరుసగా నటిస్తూ వరుస విజయాలను సాధిస్తుంది. ఇప్పుడు నయనతార లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన తమిళ సినిమా ఆరమ్‌. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో కర్తవ్యం పేరుతో డబ్ చేసి రిలీజ్‌ చేశారు. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే…

కథ :

నెల్లూరు జిల్లా వెల‌నాడు గ్రామంతో స‌హా చుట్టు పక్క‌ల గ్రామాలు తాగు నీరు లేకుండా ఇబ్బందులు పడతారు. తాగు నీరు కోసం చాలా దూరం వెళుతుంటారు. అదే సమయంలో ధన్సిక అనే నాలుగేళ్ల చిన్నారి ఊరి కౌన్సిల‌ర్ మూయ‌కుండా వ‌దిలేసిన బోరుబావిలో పడుతుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మధువర్షిణి(నయనతార) ఆ విష‌యం తెలుసుకొని ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి ఆ పాపను కాపాడటానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ అన్ని ప్రయత్నాలు విఫలం అవ్వడంతో ఆమె ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంటుంది. అ నిర్ణయం వలన ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది… అసలు మధువర్షిణి తీసుకున్న ఆ నిర్ణ‌యమేంటి? ఆ తర్వాత మ‌ధు వ‌ర్ధిని ఎదుర్కున్న సమస్యలు ఏంటి? చివరకు ఆ పాప ప్రాణాలు ఎలా కాపాడింది? ఇలా ఆ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేష‌ణ‌:

కర్తవ్యం సినిమాలో నయనతార తన విశ్వరూపం చూపించింది. ఈ సినిమా పూర్తిగా నయనతార పాత్ర చుట్టే తిరుగుతూనే ఉండిద్ది. ఒక పవర్ఫుల్ కలెక్టర్ పాత్రలో నయనతార తనదైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర పాత్రల్లో కనిపించిన నటీనటులు అందరు తమిళ చిత్ర సీమ కు చెందిన వాళ్ళే, అయినా డబ్బింగ్ లో అలాంటి ఫీలింగ్ అనిపించదు.

దర్శకుడు గోపి నైనర్ నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలని బాగా వివరించాడు‌… ప్రస్తుతం చాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నీటికోసం ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. దర్శకుడు గోపి నైనర్‌ మంచి కథను తీసుకొని, ఆ కథకు కంటతడి పెట్టించే ఎమోషన్స్‌ సీన్స్ ని జోడించి సినిమాను నడిపించాడు. అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా ఇది సినిమా అనే భావన కలగకుండా, ఇది మన ఊర్లో జరుగుతున్న, ఇది మనం ఎదుర్కొంటున్న సమస్యలే అనేలా అందరూ ఆలోచింపచేసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని నడిపించాడు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం, రాజకీయనాయకులు తప్పులను కూడా ఎత్తి చూపించారు. ఈ చిత్రానికి జిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులు వారికి తెలియకుండానే ఏడ్చేస్తారు. సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ముఖ్యంగా నిర్మాణ విలువుల బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం
నయనతార నటన
ఎమోషనల్‌ సీన్స్‌
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
కామెడీ
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం

తెలుగు బులెట్ రేటింగ్ … 3.25 /5 .