అఖిల్‌ను కాదని నానితో..

koratala siva next movie with nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానంను ప్రారంభించిన దర్శకుడు కొరటాల శివ వరుసగా సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈయన మహేష్‌బాబుతో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం భరత్‌ అను నేను చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న దర్శకుడు కొరటాల త్వరలోనే అఖిల్‌తో ఒక చిత్రం చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ తర్వాత చిత్రం అఖిల్‌తో కాకుండా నానితో ఉంటుందని తెలుస్తోంది. నాని హీరోగా ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు చేస్తున్నాడు. ఆ చిత్రాలు పూర్తి అయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను చేయడం ఖాయం అయ్యింది.

కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్‌ సినిమా చేయాలని కోరుకున్నాడు. అయితే అక్కినేని వారు కొన్ని కండీషన్స్‌ పెట్టడంతో కొరటాల శివ ఆ చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. అఖిల్‌ కోసం ఒక మంచి కథను సిద్దం చేసుకున్న కొరటాల శివకు అక్కినేని ఫ్యామిలీ నుండి కొన్ని కఠిన సలహాలు సూచనలు రావడం వల్లే తాను చేయలేను అంటూ కొరటాల వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది. అఖిల్‌కు వినిపించిన కథతో కొరటాల శివ త్వరలో నాని హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించడం ఖరారు అయ్యింది. ఈ సంవత్సరం జూన్‌ లేదా జులైలోనే చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశాలున్నాయి. మొత్తానికి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసే అద్బుత అవకాశాన్ని అఖిల్‌ చేజార్చుకున్నాడు, అదే అవకాశాన్ని తన తెలివితో నాని దక్కించుకున్నాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.