పూనం కౌర్‌కు ప్రాణహాని

Pawan Kalyan fans To say that Mortality in Poonam Kaur

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
హీరోయిన్‌ పూనం కౌర్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌ మద్య ఎలాంటి వ్యవహారం గతంలో నడిచిందో తెలియదు కాని, ప్రస్తుతం మాత్రం పూనం కౌర్‌ చేస్తున్న వ్యాఖ్యలు పవన్‌ ఫ్యాన్స్‌కు నిద్ర పట్టనివ్వడం లేదు. ఆ మద్య పవన్‌కు మద్దతుగా పూనం ట్వీట్‌ చేయడంతో కత్తి మహేష్‌ కాస్త ఘాటుగానే పూనం మరియు పవన్‌ల మద్య సంబంధంపై వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు నిజమే అంటూ సాక్ష్యాలు కూడా చూపుతాను అంటూ కత్తి మహేష్‌ సంచలనం సృష్టించాడు. అప్పుడు ఆ వివాదంకు తెర పడ్డా ఇప్పుడు మళ్లీ పూనం చేసిన ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌ రాజకీయ మరియు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

తాజాగా పూనం పేరు పెట్టకుండా చేసిన ఒక పోస్ట్‌ ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ గురించే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి వాడు అనుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ గురించి ఇలాంటి విషయాలు వినాల్సి వస్తుందని అభిమానులు ఊహించలేదు. కొందరు అభిమానులు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. పూనం వల్ల పవన్‌కు ఎప్పుడు పరువు పోతూనే ఉందని, అందుకే ఆమెను తొలగించేయాలని కొందరు భావిస్తున్నారు అంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌తో తమ పూనంకు ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో పూనం కౌర్‌కు ప్రాణహాని ఉందని వారు గట్టిగా చెబుతున్నారు. ఈ విషయమై పవన్‌ ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.