విజయ్ దేవరకొండ ‘గోల్డ్ మెడల్’ కొట్టాడు…

Vijay Devarakonda gets Gold Medal

తన విభిన్న రీతితో యూత్ లో విపరీతమయిన క్రేజ్ సంపాదించుకున్న నటుడు ‘విజయ్ దేవరకొండ’. ఇప్పుడు ఆ క్రేజ్ రాష్ట్రాన్ని దాటేసి ‘సౌత్ ఇండియా సెన్సేషన్’గా మార్చేసింది. ఈ మధ్యనే తమిళనాట జరిగిన ‘బిహైండ్ వుడ్స్ టీవీ గోల్డ్ మెడల్స్ 2018’ అవార్డ్స్ లో విజయ్ దేవరకొండ ‘ది సౌత్ ఇండియన్ సెన్సేషన్’గా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఈ అవార్డ్ మన రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ చేతుల మీదుగా ఇప్పించడం ఇంకా విశేషం. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “నాకు చాలా
ఆనందంగా ఉంది మీ ముందు ఇలా నిలబడడం, అలాగే ఈ అవార్డ్ పొందినందుకు గర్వంగా కూడా ఉంది. ఈ అవార్డ్ ఇచ్చినందుకు ‘బిహైండ్ వుడ్స్’ కి థాంక్స్, అలాగే మీ అంచనాలను అలానే నిలుపుకోవడానికి ట్రై చేస్తాను. మీ అందరికీ కూడా చాలా థాంక్స్ మీ అభిమానానికి, నా తరువాతి సినిమా ‘నోటా’ రెండు భాషల్లో వస్తుంది. మీ ప్రేమ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు. అల్లాగే విజయ్ మెడల్ అందుకున్న తరువాత రాంప్ వాక్ చేశారు.

అదేవిధంగా ఎస్.ఎస్.రాజమౌళి గారికి ‘ది విజనరీ ఆఫ్ ఇండియన్ సినిమా’ అవార్డ్, అనుష్కక ‘బెస్ట్ యాక్టర్ ఫిమేల్'(బాహుబలి2), రమ్య కృష్ణ గారు ‘బెస్ట్ సపోర్టింగ్ రోల్'(బాహుబలి2), రమా రాజమౌళి, ప్రశాంతి తిపెర్నేని లు ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్’గా(బాహుబలి2) అవార్డ్ లు గెలుచుకున్నారు. నయనతారకి ‘ది గోల్డెన్ లేడీ ఆఫ్ సౌత్ ఇండియన్ బాక్సాఫీస్’ అవార్డ్ దక్కింది. ఏదైతేనేం విజయ్ దేవరకొండ తన ఉనికిని పక్క రాష్ట్రాలకి కూడా విస్తరిస్తున్నాడు. గీత గోవిందం సినిమా విడుదల సన్నాహాల్లోఉన్న విజయ్ ‘రౌడీ వేర్’ బ్రాండ్ ప్రమోషన్లులలో కూడా బిజీగా ఉన్నాడు.