రాహుల్…పెళ్లి… గే చట్టం.

Nishikant Dubey controversy comments on Rahul Gandhi Marriage

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెళ్లి ఎప్పుడు ? ఈ విషయంలో సోనియా గాంధీ కి తొందర వుందో,లేదో గానీ బీజేపీ నాయకులకు మాత్రం ఆయనకు వెంటనే పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకు కారణం ఈ మధ్య లోక్ సభలో ప్రధాని మోడీని రాహుల్ కౌగిలించుకోవడమే. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

లోక్ సభలో రాహుల్ ఈ మధ్య మోడీని కౌగిలించుకున్న సీన్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. ఆ సీన్ లో మోడీ మొహమాటం, రాహుల్ లో ఆత్మవిశ్వాసం బాగా ప్రతిఫలించాయి. ఇది తెలుసుకున్న రాహుల్ అదే ఊపులో తాను ఎక్కడ కౌగిలించుకుంటానో అని బీజేపీ నేతలు భయపడుతున్నారు అని కామెంట్ చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ నిశికాంత దూబే భిన్నంగా స్పందించారు.

రాహుల్ ని కౌగిలించుకునే అవసరం మాకు ఏంటని నిషికాంత్ ప్రశ్నించారు. పైగా స్వలింగ సంపర్క చట్టం సెక్షన్ 377 ఇంకా రద్దు కాలేదని నిషికాంత్ గుర్తు చేశారు. పైగా రాహుల్ ని కౌగిలించుకుంటే మా భార్యలు విడాకులు ఇచ్చే ప్రమాదం ఉందని కూడా ఆయన కౌంటర్ వేశారు. ఇంత ఇబ్బంది పడే బదులు రాహుల్ పెళ్లి చేసుకుంటే మంచిదని నిషికాంత్ సూచించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అయ్యాయి. అటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సదరు బీజేపీ ఎంపీ మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు.