రాముడికి భయపడ్డ అరవింద్ !

controversy-on-geetha-govindam-movie-what-the-f-song

యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మొదటిసారి గాయకుడిగా మారి గీత గోవిందం సినిమా కోసం పాడిన వాట్ ది ఎఫ్ పాట ఇప్పుడు అనేక వివాదాలకు దారి తీస్తోంది. నిజానికి సాంగ్ రిలీజ్ అయిన కొద్ది సేపటి నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అమ్మాయిల వల్ల లైఫ్ ఎలా అవుతుందో వివరిస్తూ విజయ్ దేవరకొండ పాడిన ఈ పాట ఇటీవలి కాలంలో శ్రీనివాస కల్యాణం సినిమాలో పెళ్లి విశిష్టత మీద పాట రాసిన గీత రచయిత శ్రీమణి రాసాడు. అయితే ఇందులో రెండు లైన్ లు వివాదానికి కారణం అయ్యాయి. అవేమిటంటే.

“రాముడు గాని ఇప్పుడు పుట్టి జంగిల్ కి పోదాం రారమ్మంటే సీతకు కాస్తా సిరాకు లేసి సోలోగే పామంటెడ్” అని ఇందులో ఉంది. అంటే ఇప్పుడున్న ట్రెండ్ లో సీత రాముడితో అడవికి రాలేదు అని శ్రీమణి ఉద్దేశం. ఇది రైమింగ్ కోసం రాసిందే అయినా మనోభావాలు దెబ్బ తినేలా ఉండటంతో వైరల్ అయిపోయింది. పాట వచ్చిన కొద్ది సేపటికే మాటల దాడి మొదలయ్యింది. ఇటీవల రాముడి మీద కామెంట్స్ చేసిన వ్యవహారంలో ఇద్దర్ని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించే దాకా తేవడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్న గీత ఆర్ట్స్ అలెర్ట్ అయి శ్రీమణితో వివరణ ఇప్పించేసింది. లిరిక్స్ ని కూడా మార్చేస్తున్నారు. నిన్న సాయంత్రానికి ఈ పాట యు ట్యూబ్ లో డిలీట్ చేసేసింది గీతా ఆర్ట్స్ అయితే ఆ లిరిక్స్ మార్చి మళ్ళి రికార్డింగ్ చేసి ఈ రోజు అప్ లోడ్ చేసే అవకాశాలు ఉన్నాయి.