చిరు రికార్డు గోవింద…!

Geetha Govindam Movie Crossed In Khaidi 150 Movie

విజయ్‌ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్‌గా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’ ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే. నైజాం ఏరియాతో పాటు ఓవర్సీస్‌లో ఈ చిత్రం దూకుడు స్టార్‌ హీరో సినిమాల కంటే ఎక్కువగా ఉంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం టాప్‌ 10 చిత్రాల జాబితాలో ఎప్పుడో చేరింది. నిన్నటి వరకు ఖైదీ నెం.150 చిత్రం 8వ స్థానంలో, విజయ్‌ దేవరకొండ మూవీ గీత గోవిందం 9వ స్థానంలో ఉంది. తాజాగా ఖైదీ నెం.150 చిత్రాన్ని వెనక్కు నెట్టేసి విజయ్‌ దేవరకొండ మూవీ 8వ స్థానంను ఆక్రమించింది.

chiru-cressed-geeth-govindh

ఖైదీ నెం.150 చిత్రం లాంగ్‌రన్‌లో 8వ స్థానంను ఆక్రమించేందుకు చాలా కష్టపడినది. కాని విజయ్‌ దేవరకొండ మాత్రం కేవలం 25 రోజుల్లోనే ఆ ఫీట్‌ను సాధించింది. ఇప్పుడు గీత గోవిందం కంటే ముందు ‘మహానటి’ మరియు ‘అఆ’ చిత్రాలు కొద్ది తేడాతో ఉన్నాయి. ఆ రెండు చిత్రాలను కూడా రెండు వారాల్లోనే క్రాస్‌ చేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున రూపొందిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి మెగాస్టార్‌ చిరంజీవి సినిమా కలెక్షన్స్‌ను క్రాస్‌ చేయడం సంచలనం అయ్యింది. ఈ చిత్రం ముందు ముందు మరెన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుందో అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వచ్చిన శైలజారెడ్డి అల్లుడు అంతగా అలరించలేక పోయింది. ఆ కారణంగానే గీత గోవిందం జోరు ఇంకా కొనసాగే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

chiru