ఇదేనా బిజేపీ నీతి ?… యనమల

Yanamala Ramakrishnudu Comments On NDA Govt
  • ఒక పత్రికా ప్రకటనలో బిజేపీపై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు
  • ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇచ్చారు: యనమల
  • దొంగలు అందరినీ దేశం దాటిస్తున్నారు.
  • అవినీతిపరులతో అంటకాగుతున్నారు.
  • ప్రజాదరణ ఉన్నవారిని వేధింపులకు గురిచేస్తున్నారు.
  • బిజేపీ పెడధోరణులు దేశానికే తీవ్ర ముప్పుగా పరిణమించాయి.

bjp

  • ప్రధాని నరేంద్రమోది ఎన్నికల వ్యూహాలు వికటిస్తున్నాయి.
  • విజయ్ మాల్యా, నీరవ్ మోది, మెహుల్ చోక్సీ పరారీ వెనుక గుట్టుమట్లు వెల్లడించాలి.
  • ఆర్ధిక నేరగాళ్లు విదేశాలకు పరారు కావడం వెనుక సూత్రధారులు ఎవరు..? పాత్రధారులు ఎవరు..?
  • 8ఏళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడితే ఇప్పుడు వారెంట్లు రావడం ఏమిటి?

    బాబ్లీ మీద పోరాటం ఎవరి కోసం..?

  • 74మంది ఎమ్మెల్యేలు,ఎంపిలు లాఠీదెబ్బలు తిన్నదెవరి కోసం..?
  • తెలుగువాళ్లు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్నదే టిడిపి ధ్యేయం.

TDP And Modi

  • రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపిని దెబ్బతీయాలన్నదే నరేంద్ర మోది వ్యూహం
  • టిడిపి ఆధ్వర్యంలో మోది వ్యతిరేక శక్తులు బలోపేతం కావడంపై బిజెపిలో అక్కసు.
  • బిజెపి వ్యతిరేక కూటమిని బలహీన పరిచేందుకే మోది మహా కుట్రలు చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు రావడం ఇందులో భాగమే.
  • తమ చెప్పుచేతల్లో మీడియా సంస్థల ద్వారా బోగస్ సర్వేలు ఇందులో భాగమే
  • 2014లో ఇవే సంస్థలు చేసిన సర్వేలు అవాస్తవమని ప్రజాతీర్పు రుజువు చేసింది
  • సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం అసాధ్యం వేధింపు చర్యలకు ప్రజలే గుణపాఠం చెబుతారు.
  • తెలుగు ప్రజల గుండెల్లోనుంచి టిడిపిని దూరం చేయడం ఎవరి తరం కాదు: ఆర్ధికమంత్రి యనమల