పులి మీద పడిన లేడి… అరవింద సమేత

Aravindha Sametha Anaganaganaga Lyrical Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన దగ్గర నుంచి ఆ సినిమా ఎలా ఉంటుందో అని ఒక్క ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాదు యావత్ ఇండస్ట్రీ నుంచి ఓ ఆసక్తి మొదలైంది. సినిమా టీజర్ బయటకు వచ్చాక అందులో పులిలా చెలరేగిపోతున్న ఎన్టీఆర్ ని చూసి ఖుష్ అయినప్పటికీ ఎక్కడో త్రివిక్రమ్ మార్క్ కనిపంచలేదన్న అభిప్రాయం కొందరిలో కలిగింది. ఈ టైం లో నేడు విడుదల అయిన అరవింద సమేత వీర రాఘవ తొలి పాట ఆ లోటు తీర్చింది. ఎన్టీఆర్ ని పూజ హెగ్డే కామెంట్ చేసే సీన్ తో మొదలై పాటలోకి వెళ్లిన వైనం బాగుంది. ఇక పాటలో సాహిత్యం కూడా సరికొత్తగా వుంది.థమన్ మరోసారి తన మార్క్ చూపించాడు.