‘మా’వాళ్లు అంతా ఒక్కటయ్యారే…!

Shivaji Raj Naresh Has Come Together In Maa Association

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌లో గత కొంత కాలంగా నెలకొని ఉన్న వివాదాలు ఈమద్య కాలంలో బయటకు వచ్చిన విషయం తెల్సిందే. మా నిధులను శివాజీ రాజా మరియు శ్రీకాంత్‌లు గోల్‌ మాల్‌ చేస్తున్నారు అంటూ స్వయంగా నరేష్‌ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. కోట్లను కాజేస్తూ మా అధ్యక్షుడు అంతా మాయ చేస్తున్నాడు అంటూ నరేష్‌ విమర్శించడం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంకు తెర తీసిన విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలోనే సినీ ప్రముఖులు మా లోని వివాదాలను తొలగించేందుకు ప్రయత్నించారు. రెండు వారాల్లోనే సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూర్చుని ఈ విషయంపై రాజీ కుదిర్చినట్లుగా తెలుస్తోంది.

shivaji-raj-and-naresh

కారాలు మిరియాలు నూరిన శివాజీ రాజా మరియు నరేష్‌లు కలిసి మీడియా ముందుకు వచ్చి అందరికి షాక్‌ ఇచ్చారు. మొన్నటి వరకు ఒకరంటే ఒకరు ఆగ్రహంతో ఉన్న వీరిద్దరు తాజాగా కెమెరా ముందుకు వచ్చి, ఒకరిపై ఒకరు చేయి వేసుకుని నవ్వుతూ కనిపించారు. వీరిని కలపడంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఇంకా పలువురు ప్రముఖ పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రెస్‌మీట్‌తో మాలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేందుకు ప్రయత్నించారు. కని గోల్‌ మాల్‌ అయిన నిధుల గురించి మాత్రం మీడియా ముందు శివాజీ కాని నరేష్‌ కాని ఏమ్తారం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. మాలో ఉన్న విభేదాల కారణంగా పలు కీలకమైన కార్యక్రమాలు రద్దు అయినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి, మరి ఆ కార్యక్రమాల పరిస్థితి ఏంటీ అనేది చూడాలి.

shivaji-raj-naresh-maa