నాగ్‌ కొత్త మల్టీస్టారర్‌ అప్‌డేట్స్‌…!

Nagarjuna Another Multistarrer Movie With Tamil Hero

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఇకపై వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేయాలని భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. వయస్సు తగ్గ పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగాగతంలో చెప్పుకొచ్చిన నాగార్జున ప్రస్తుతం నానితో కలిసి ‘దేవదాస్‌’ అనే మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘దేవదాస్‌’ విడుదల కాకుండానే మరో సినిమాతో ఈయన రెడీ అయ్యాడు.

danush-nag

‘దేవదాస్‌’ చిత్రం తర్వాత మరో మల్టీస్టారర్‌ను ఈయన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో నాగార్జున ఒక చిత్రం చేయబోతున్నాడు. ఆ చిత్రానికి స్వయంగా ధనుష్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా అదితిరావు మరియు అను ఎమాన్యూల్‌లు నటించబోతున్నారు. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంను వచ్చే సంవత్సరం వేసవి లేదా దసరాకు విడుదల చేయబోతున్నారు.

danush