మరో బస్సు ప్రమాదం…11 మంది…!

11 Injured In RTC Bus Accident In Telangana

తెలంగాణాలో మరో బస్సు ప్రమాదానికి గురయ్యింది. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు బోల్తాపడి 62మంది దుర్మరణం పాలైన విషాద సంఘటనను మరవకముందే అలాంటి ఘోర ప్రమాదమే కొంచెంలో తప్పిపోయింది. ఈ ప్రమాదంలో నుంచి ప్రయాణికులు మృత్యువు అంచు దాకా వెళ్లి క్షేమంగా బయటపడ్డారు. అందుతున్న సమాచారనం ప్రకారం వీఆర్‌ఓ పరీక్ష జరగనుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి అభ్యర్థులు వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని సెంటర్లలో పరీక్ష రాసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో బయలుదేరిన యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చాలా మంది జడ్చర్లలో ఎక్కారు. పరిమితికి రెండింతలు మించి ఎక్కడంతో ఆర్టీసీ బస్సు టైర్‌ రాడ్‌ ఊడిపోయి పొలంలోకి దూ సుకెళ్లింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్రంగా గా యపడ్డారు. వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదం బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.

bus-accedent--in-vattem
దాదాపు వంద మందికిపైగా బస్సు లోపల, టాప్‌పై ప్రయాణికులతో బయలుదేరింది. బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలోకి రాగానే బస్సు ముందు టైర్‌ ఊడిపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. బస్సును అదుపు చేసేందుకు డ్రైవర్‌ విఫలయత్నం చేశాడు. దీంతో టాప్‌పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు కుదుపులకు బస్సు మీద నుంచి చెల్లాచెదురుగా కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు ఒక్కసారిగా అదుపు తప్పడం, పక్కకు ఒరిగిపోవడం, బయట నుంచి ఆర్తనాదాలు వినిపిస్తునండటంతో లోపల ఉన్న ప్రయాణికులకు ఇవేమీ అర్థం కాలేదు. అయితే ఏదో ప్రమాదం జరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకున్న వారంతా ఒక్కసారిగా బస్సు లోపలి నుంచి బయట పడేందుకు ఇబ్బంది పడ్డారు. బయటికి వచ్చే డోరు కూడా బిగుసుకుపోవడంతో బస్సు ముందు భాగం అద్దాలు పగులగొట్టి అందులోంచి బయటకు వచ్చారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రి ఆవరణ మొత్తం క్షతగాత్రులు, ప్రయాణికుల రోదనలతో భీతి గోలిపింది. అయితే తీవ్రంగా గాయపడిన 11 మందిలో 9 మందిని హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

accedent-boinapally