దేవెగౌడకి బాబు ప్రధాని పదవి ఆఫర్ చేశారా !

CBN Offers PM Candidature To Devegowda

సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరేడు నెలలు ఉందనగా జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రోడ్డులో పునఃనిర్మించిన భవనంలోకి శుక్రవారం మళ్లీ గృహ‌ప్రవేశం చేసి జాతీయ రాజకీయాల్లో తాను మరోసారి కీలకం కాబోతున్నట్టు ఆయన సంకేతాలు పంపారు. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు, ఆయనతో భేటీ అయిన మర్నాడే తనకు అన్ని విధాల కలిసొచ్చిన ఇంటిలోకి దేవెగౌడ మరోసారి గృహ‌ప్రవేశం చేయడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత వివిధ పార్టీలు యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడగా, దీనికి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు తెలిపింది. నాటి ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. దీంతో దేవేగౌడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారన్న సంగతి తెలిసిందే.

deve gowda recent house opening
అయితే, ఆయన ప్రస్తుతం గృహ‌ప్రవేశం జరిగిన ఇంట్లోకి వెళ్లిన తర్వాతే ప్రధాని పదవి వరించడంతో తన కుటుంబానికి అదృష్టం కలిసొచ్చిందని ఆయన బలంగా నమ్ముతారు. జ్యోతిష్యాన్ని బాగా నమ్మే గౌడ కుటుంబం ఓ జ్యోతిషుడు సలహాతో ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయించి, వాస్తు దోషాన్ని సవరించారు. ఇక దుబాయ్ పర్యటనకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన దేవేగౌడ భగవంతుని దయవల్ల తన శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో సమర్ధవంతంగా ఉందని, అయినంత మాత్రాన ప్రధాని పదవిని చేపట్టడానికి ఇవే అర్హతలు కావని వ్యాఖ్యానించారు.

deve gowda

దీంతో తాను కూడా ప్రధాని రేసులో ఉన్నానని దేవెగౌడ సంకేతాలు ఇచ్చినట్టయ్యింది. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలు వేసి తన కుమారుడికి ప్రధాని నరేంద్ర మోదీ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు ఆయన ధీటుగా బదులిచ్చారు మరి. అంతేకాక ఊరికి ముంది పీఎం క్యాండిడేట్ ని ప్రకటించే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించిన తర్వాతే ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని ఇటీవలే ప్రకటించింది. దీంతో ప్రధాని పదవిపై జేడీఎస్‌ మరింత ఆశలు పెంచుకుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలున్నా కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి బాధ్యతలు చేపట్టారు. ప్రధాని పీఠం కూడా ఇలాగే తమకు దక్కుతోందని ఆ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది.