పడి పడి లేచే మనసు టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో: వినగానే నచ్చుతుంది

Padi Padi Leche Manasu Title Song Lyrical Video

పడి పడి లేచే మనసు అంటూ శర్వానంద్ మరియు సాయి పల్లవి లు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడానికి డిసెంబర్ 21 న సిద్ధం అవుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈమద్యే విడుదలైన టీజర్ కి వీక్షకుల నుండి మంచి స్పందన లభించడమే కాకుండా ఈ సినిమా పైన ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. టీజర్ ని గమనిస్తే ఈ సినిమాలో ఎక్కువ శాతం కలకత్తా లో సాగుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో మాటిమాటికీ గతం మరిచిపోయే డాక్టర్ పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, తనకి ప్రతిసారి గతం గుర్తుచేసే ప్రియుడిగా శర్వానంద్ నటిస్తున్నాడు.

Padi Padi Leche Manasu Movie Title Song Release D

తాజాగా ఈ సినిమా నుండి పడి పడి లేచే మనసు అంటూ సాగే టైటిల్ సాంగ్ ఈరోజే విడుదలయ్యింది. ఈ పాట ని అర్మాన్ మాలిక్, సిందూరీ విశాల్ ఆలపించగా, కృష్ణకాంత్ రచన చేశారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం చెవులకు ఇంపుగా ఉండగా, లిరికల్ వీడియో లో చూపించిన విజువల్స్ కనులకు ఇంపుగా, సినిమా యొక్క రిచ్ నెస్స్ ని తెలిపేలా ఉంది. డైరెక్టర్ హను రాఘవపూడి ఇప్పటికే లై అనే డిజాస్టర్ సినిమాని అందించగా, ఇప్పుడు తనకి ఈ సినిమా విజయం ఖచ్చితంగా అవసరం. ఇప్పటివరకు ఈ సినిమా పైన పాజిటివ్ బజ్ నెలకొనే ఉంది. కానీ, డైరెక్టర్ హను రాఘవపూడి విషయంలోనే స్క్రీన్ ప్లే తో చెడగొడతాడు అనే అపవాదు ఉంది. సినిమా షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ కూడా ముగించుకొని డిసెంబర్ 21 న విడుదలయ్యేందుకు సిద్ధం అవుతుంది.