ఉత్తరాదికి మహానటి ప్రయాణం

Mahanati To Be Dubbed Into bollywood By Aditya Chopra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని, ఒక మోస్తరు వసూళ్లను రాబడుతుందని అంతా భావించారు. కాని విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను రాబుడుతూ ఉంది. భారీ ఎత్తున ఈ చిత్రం వసూళ్లు రాబట్టడంతో నిర్మాత అశ్వినీదత్‌ భారీ లాభాలను మూట కట్టుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం స్టార్‌ హీరో సినిమా రేంజ్‌లో రాబడుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం టాప్‌ చిత్రాల జాబితాలో నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన మహానటి చిత్రాన్ని బాలీవుడ్‌కు తీసుకు వెళ్లేందుకు ఆదిత్య చోప్రా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇటీవలే ‘మహానటి’ చిత్రాన్ని చూసిన ఆయన హిందీలో డబ్బింగ్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంకు వచ్చాడు. దాంతో వెంటనే నిర్మాతను ఆయన సంప్రదించాడు. తెలుగు స్టార్‌ను నార్త్‌కు తీసుకు వెళ్తానంటే ఆనందమే అంటూ అంగీకారం చెప్పారట. దాంతో త్వరలోనే డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపబోతున్నారు. తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న మహానటి హిందీ మరియు తమిళ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. తప్పకుండా సినిమా ఓ రేంజ్‌లో అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్స్‌ను రాబడుతుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మరి నార్త్‌లో మహానటి ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.