‘మా’ వారు దాసరిని అవమానించారు : మోహన్‌బాబు

mohan babu sensational comments on maa over Dasari's Statue issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొంత కాలంగా మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌(మా) వారు చేస్తున్న ప్రతి పని కూడా విమర్శల పాలు అవుతుంది. ఆ మద్య శ్రీరెడ్డికి మా లో సభ్యత్వం ఇవ్వం అని, ఆమెతో నటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరించి, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమెపై బ్యాన్‌ ఎత్తేసి, ఆమెకు సభ్యత్వం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ సంఘటన మా యొక్క పరువు తీసింది. ఈ విషయమై పలువురు సినీ ప్రముఖులు మా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా చేసిన అనాలోచిత పని వల్ల ఇండస్ట్రీ పరువు పోయింది అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మా ప్రెసిడెంట్‌ శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త సైలెంట్‌ అవుతున్న సమయంలో మళ్లీ మోహన్‌బాబు లైన్‌లోకి వచ్చాడు.

ఇటీవల దాసరి జయంతి సందర్బంగా ఫిల్మ్‌ నగర్‌లో ఆయన విగ్రహంను ఆవిష్కరించడం జరిగింది. ఫిల్మ్‌ నగర్‌లో జరిగిన ఆ ఆవిష్కర కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే మోహన్‌బాబును మాత్రం ఆ కార్యక్రమంకు ఆహ్వానించలేదు. మోహన్‌బాబు ఆ విషయమై చాలా సీరియస్‌ అవుతున్నాడు. తనను ఆహ్వానించక పోవడంతో పాటు దాసరి విగ్రహంను కాంస్యంతో కాకుండా మట్టితో తయారు చేయించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాంస్య విగ్రహంకు డబ్బులు లేకుంటే తాను ఇచ్చేవాడిని అని, తనను సంప్రదించకుండా విగ్రహం పెట్టడం తనకు బాధను కలిగించింది అంటూ మోహన్‌బాబు మా తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా పలువురు కూడా దాసరి కాంస్య విగ్రహం కాకుండా మట్టి విగ్రహం పెట్టడంను తప్పుబడుతున్నారు.