ఎయిడ్స్‌ అంటూ కామెంట్స్‌.. శ్రీరెడ్డి సీరియస్‌

actor srireddy files a complaint over vulgar posts on her in social media

Posted May 16, 2018 (1 week ago) at 17:00

శ్రీరెడ్డి ఈమద్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. టాలీవుడ్‌ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈమె ఒక్కసారిగా ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యింది. ఈమెకు వచ్చిన గుర్తింపు అంతే స్పీడ్‌గా పోయింది. పవన్‌పై ఈమె చేసిన వ్యాఖ్యల కారణంగా ఈమెపై జాలి చూపించిన వారు అంతా కూడా వ్యతిరేకంగా మారిపోయారు. అయినా కూడా తాను కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాను అంటూ చెబుతూ వస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం కొందరు మహిళ సంఘాల నాయకురాల్లతో కలిసి మీటింగ్‌లకు వైగరా హాజరు అవుతూ ఉంది. తన పనేదో తాను చేసుకుంటూ ఉంటే ఈమెను కొందరు సోషల్‌ మీడియాలో తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు, కామెంట్స్‌కు తనదైన శైలిలో సమాధానం చెబుతూ ముందుకు వెళ్తుంది.

తాజాగా సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డికి ఎయిడ్స్‌ అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు. దాంతో పాటు శ్రీరెడ్డి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందని ఇంకా పలు కామెంట్స్‌ ఫేస్‌బుక్‌ ట్విట్టర్‌లో పెడుతున్నారు. దాంతో ఆగ్రహించిన శ్రీరెడ్డి వారిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే సైబర్‌ క్రైమ్‌ వారు 41 మందిపై కేసులు నమోదు చేశారు అని, తనను అవమానించినట్లుగా కామెంట్స్‌ చేసే ప్రతి ఒక్కరిపై తాను కేసు పెడతాను అంటూ చెప్పుకొచ్చింది. తనను మోసం చేసిన పెద్ద వారపై కూడా కేసులు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అలాగే తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కడి తాట తీస్తాను అంటూ ఫేస్‌బుక్‌ ద్వారా శ్రీరెడ్డి వార్నింగ్‌ ఇచ్చింది.

SHARE