ANR ఫస్ట్ లుక్: ఎన్టీఆర్‌లో సుమంత్ ఏఎన్నార్ లా!

ANR First look in NTR biopic

ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి ఒక్కొక్క లుక్ విడుదల అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్‌లా బాలయ్య లుక్ ఒకటి విడుదల కావడం, ఆ తర్వాత ప్రముఖుల లుక్స్ ఒక్కొక్కటిగా విడుదల అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతూ వస్తున్నాయి. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించిన స్టిల్‌ను విడుదల చేశారు. ఈ పరంపరలో ఏఎన్నార్ ఫస్ట్‌లుక్ కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది.

ANR First look

ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రను ఆయన మనవళ్లలో ఒకరైన సుమంత్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టిల్‌లో తాతగారిని ప్రతిబింబింపజేసేలా సుమంత్ ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాలా ? ఈ సినిమాలో ప్రముఖుల లుక్స్ పై రూపకర్తలు చాలా కసరత్తే చేశారని, చాలా శ్రద్ధ వహిస్తున్నారని ఆయా లూక్స్ ని చూస్తే స్పష్టం అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాలయ్యను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.