ఇంటర్ లోనే ఆటో ప్రేమ ….గుర్తించ లేదు అని ఆత్మ హత్య

Love in Auto killed Two Persons in Telugu States

అతను ఆటో నడుపుకునే యువకుడు. పెళ్లయి, చిన్న బాబు కూడా ఉన్నాడు. అతని ఆటోలో వెళ్లే ఓ ఇంటర్ విద్యార్థిని, ఏది ఏమిటో తెలియని వయసులో అతనితో ప్రేమలో పడింది. అతడికి పెళ్లై భార్య, ఓ కుమారుడున్నారన్న సంగతి తెలిసి కూడా అతడితోనే కలిసుండాలని ఆ విద్యార్థిని నిర్ణయించుకుంది. ఆ ఆటో డ్రైవర్ కూడా ఆమె కావాలని అనుకున్నాడు. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాల్లో గొడవలు మొదలయ్యాయి ఇద్దరూ ఆత్మహత్యాయత్నాలు చేశారు. కేసులు పెట్టినా ఆటో డ్రైవర్ ఆమెను వదిలి ఉండలేకపోయాడు. భార్యాబిడ్డలను మరచి ఆ మైనర్ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు.

husband illegal afair

అయితే, తమ ప్రేమను లోకం అంగీకరించదని భావించిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా తిరువూరు మండలం కోకిలంపాడుకు చెందిన జొన్నలగడ్డ తిరుపతిరావు (23)కు దీప్తితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆటో నడపుతూ జీవనం సాగించే తిరుపతిరావు అదే గ్రామానికే చెందిన ఇంటర్ బాలిక కొంగల శ్రీలక్ష్మి(18)ని రోజూ తన ఆటోలోనే కాలేజీకి తీసుకెళ్లేవాడు. ఆ క్రమంలో వారి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేయడమే కాదు, పలుమార్లు పెద్దల వద్ద పంచాయతీలూ కూడా జరిగాయి. అయినా సరే అతడితోనే ఉంటానని శ్రీలక్ష్మీ మొండికేసింది. ఎనిమిది నెలల కిందట ఒకసారి ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తిరుపతిరావును వదిలేయాలని శ్రీలక్ష్మీకి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. అయితే తాను మారనని తెగేసిచెప్పడంతో నాలుగు రోజుల కిందట ఆమెను తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్లగొట్టారు.

marriage

 

దీంతో ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. ఏమైందో తెలియదు నిన్న ఉదయం తిరుపతిరావు తమ బంధువు శివకు ఫోన్‌చేసి గుడికి వెళ్దాం రమ్మని పిలిచాడు. శివ వచ్చిన తర్వాత ముగ్గురూ కలిసి గుడికి వెళ్లారు. అప్పటికే పురుగులమందు కలిపిన కూల్ డ్రింక్ తాగారు. కొద్దిసేపటి తర్వాత శివకు ఆ విషయం చెప్పడంతో కంగారుపడిన అతడు వారిని ఆసుపత్రికి తీసుకువెళ్దేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవడంతో స్థానికుల సాయంతో పెనుబల్లి ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఇద్దరూ మృతి చెందారు.