రీ రిలీజ్ కు సిద్ధమైన నాగార్జున మన్మధుడు విడుదల తేది ఫిక్స్..?

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తున్న సంగతే మనకు తెలిసిందే.ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాల వరకు ప్రతి ఒక్క సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తిరిగి విడుదల కానుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై స్వయంగా నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకుడిగా వ్యవహరించారు. నాగార్జున, సోనాలి బింద్రే అన్షు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.2002 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్గా నిలిచింది.ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో ప్రసారమైన కన్నార్పకుండా చూసేవారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.

ఇలా నాగార్జున కెరియర్ లోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాని నెల 29వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇలా ఈ నెల 29వ తేదీ ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాని మరోసారి సక్సెస్ చేయాలనే ఆలోచనలో అక్కినేని అభిమానులు ఉన్నారు.

అయితే ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలు ఏవి ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి అంతేకాకుండా గత సంవత్సరం కాలం పాటు నాగార్జున కొత్త సినిమాలను కూడా ప్రకటించకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.ఇలాంటి తరుణంలోనే మన్మధుడు సినిమాని తిరిగి విడుదల చేయబోతున్న నేపద్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున చివరిగా గోస్ట్ అనే  సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.