ఐదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ప్రిన్సిపాల్ !

Patna School Principal For raping In V Class Girl

మహిళల సంగతి పక్కన పెడితే ముక్కుపచ్చలారని చిన్న పిల్లలు సైతం మృగాల్ల బారిన పడుతున్నారు.అభం శుభం తెలియని చిన్నారులను కళ్లల్లో పెట్టుకుని చూడాల్సిన ఒక పాటశాల ప్రిన్సిపాల్ , క్లర్క్‌లు కామంతో కళ్లు మూసుకుపోయి ఒక బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పాఠశాలలో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినిపై గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణంలో బీహారు రాజధాని పాట్నాలోని ఫుల్వారీ షరిఫ్ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపల్ గత తొమ్మిది నెలలుగా బాధితురాలిపై అత్యాచారం చేస్తున్నాడు.

rape case
ఈ విషయం తెలుసుకున్న పాఠశాల క్లర్క్ ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయకుండా ప్రిన్సిపల్ ఆమె పై అత్యాచారం చేస్తున్నప్పుడు వీడియో తీశాడు. ఆ వీడియోను చిన్నారికి చూపించి, ఇది అందరికీ చూపించేస్తానని బెదిరించి అతను కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రెండు నెలల గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు షాకయ్యారు. దీనిపై చిన్నారిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ప్రిన్సిపల్, క్లర్క్‌ను అరెస్టు చేసి ఇద్దరిపై పొస్కొ చట్టం కింద కేసులు నమోదు చేసారు పోలీసులు.