మీ టూ: సూపర్‌స్టార్‌కు ఇదే నా సవాల్‌…!

MeToo Movement Shraddha Srinath Attacks Superstars

బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణల వల్ల ఇండియాలో మీ టూ ఉద్యమం బాగా వేడెక్కింది. సినీ పరిశ్రమల్లో పనిచేసే నటీమణులు, టెక్నిషీయన్లు అంతా కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి మీ టూలో భాగంగా చెబుతున్నారు. కానీ ఈ ఆరోపణలకు సంబంధించిన క్లారిటీ మాత్రం ఆరోపణలు మోపబడిన వ్యక్తులు ఇవ్వడం లేదు. కన్నడ హీరోయిన్‌ శృతిహరిహరన్‌ స్టార్‌ హీరో అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. శృతికి మొదటగా మద్దతు తెలిపినది హీరోయిన్‌ శ్రద్దా శ్రీనాధ్‌. కన్నడంలో ‘యూటర్న్‌’ చిత్రంతో క్రేజీ స్టార్‌గా మారిపోయిన శ్రద్దా మీ టూ ఉద్యమంపై చాలా ఆక్టివ్‌గా పోరాడుతోంది. మహిళలకు రక్షణ కోసం అందరు కూడా సపోర్ట్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తోంది.

Sruthi Hariharan Accuses Arjun Of Harassment

ఈ అమ్మడు తాజాగా స్టార్‌ హీరోలందరికి సవాల్‌ విసురుతోంది. సినిమాల్లో తమ వారిని కాపాడుకోవడానికి గుంపులుగా వచ్చిన రౌడీలను హీరోలు చితక బాదుతారు. తమ వారిని కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయనట్టుగా సినిమాల్లో చూపిస్తారు. అలాంటిది బయట మహిళల కోసం వస్తున్న మీ టూపై ఒక్క సూపర్‌స్టార్‌ కూడా స్పందించరే. సూపర్‌స్టార్‌లు అంతా కూడా మీ టూకు మద్దతిచ్చి మహిళల కోసం పోరాడుతుంటే చూడాలని ఉంది, ఏ ఒక్క స్టార్‌ హీరో అయినా నా సవాల్‌ స్వీకరిస్తాడా చూస్తాను అంటూ సవాల్‌ విసురుతోంది. అయితే సూపర్‌స్టార్‌లు మీ టూ లో ఎంతవరకు భాగం అవుతారో చూడాలి.

meetoo