పెళ్లి పీటలెక్కనున్న హీరో రానా , మిహీకా

పెళ్లి పీటలెక్కనున్న హీరో రానా , మిహీకా

మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి వేడుక సందడి మొదలైంది.పెళ్లి పనుల హడావిడి ఇరు కుటుంబాల్లోనూ ప్రారంభమైంది. పెళ్లికూతురు మిహికా బజాజ్ హల్దీ వేడుకలో మెరిసిపోయింది. వివాహానికి ముందు జరిగే ఈ వేడుకలో మిహికా పసుపు-ఆకుపచ్చ లెహంగాలో ఆకర్షణీయంగా నిలిచారు. ప్రత్యేక సీ షెల్స్ డిజైనర్ ఆభరణాలతో ఆకట్టుకుంటున్నారు.

కాగా రామానాయుడు స్టూడియోలో ఆగస్టు 8న రానా తన ప్రేమికురాలు మిహికా మెడలో మూడుముళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. రానా, మిహికా కుటుంబాల నుండి కొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. అతిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు, చెఫ్‌లు, సర్వర్‌లను కూడా పరీక్షిస్తున్నామని, కరోనా ప్రోటోకాల్ ప్రకారం వారందరూ ఐసోలేషన్‌లో ఉన్నట్టు నిర్మాత సురేష్ వెల్లడించారు.