ట్రైలర్‌ టాక్‌ : ‘మిఠాయి’ రుచిగా ఉంటుందేమో…!

Mithai Trailer

విజయ్‌ దేవరకొండకు ‘పెళ్లి చూపులు’ మరియు ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలు ఏ రేంజ్‌లో గుర్తింపును తెచ్చి పెట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి స్థాయి కాకున్నా కూడా పెళ్లి చూపులు చిత్రం ప్రియదర్శికి, అర్జున్‌ రెడ్డి చిత్రం రాహుల్‌ రామకృష్ణకు మంచి ఇమేజ్‌ను కట్టబెట్టాయి. వీరిద్దరు కూడా మంచి ఆఫర్లతో ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి కమెడియన్స్‌గా దూసుకు పోతున్నారు. ఇలాంటి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే కామెడీకి కొదవేముంటుంది చెప్పండి. తాజాగా వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘మిఠాయి’. టైటిల్‌ తోనే నవ్వు పుట్టించిన ఈ ఇద్దరు సినిమాతో మరింతగా నవ్వించబోతున్నారని తాజాగా విడుదలైన ట్రైలర్‌తో అనిపిస్తుంది.

mithaie

ఈమద్య కాలంలో చాలా కామన్‌ అయిన అడల్డ్‌ కామెడీతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ట్రైలర్‌ను బట్టి అర్థం అవుతుంది. పెద్ద కంపెనీలో జాబ్‌ చేసే రాహుల్‌ రామకృష్ణ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతాడు, వారంలో పెళ్లి అనుకోగా ఆయన అనుకోని సమస్యలో ఇరుక్కుంటాడు. ఈ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. అన్ని వర్గాల వారిని ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసి తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.