జగన్ ప్రమాణ స్వీకారానికి మోడీ, కేసీఆర్ ?

Modi and KCR to attend Jagan's swearing-in ceremony.
ఏపీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రానుంది వైసీపీ. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రిగా  జగన్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో ఇంకాసేపట్లో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. వైసీపీఎల్పీ నేతగా జగన్‌ను ఎమ్మెల్యేలంతా ఎన్నుకుంటారు. అనంతరం జగన్ నేరుగా హైదరాబాద్ చేరుకొని గవర్నర్‌ను కలవబోతున్నారు.
    అలాహ్గే ఈరోజు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్‌ను ఆహ్వానించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఎన్నికల ఫలితాలతో పాటూ భవిష్యత్ రాజకీయాలపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. మరోపక్క జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని మోడీతో సమావేశంకానున్నారు.

      30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోడీని ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్‌కు గురువారం మోదీ ట్విట్టర్‌లో జగన్‌కు అభినందనలు తెలిపారు. ట్వీట్‌లో ‘ప్రియమైన వైఎస్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు’తెలిపారు.