సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్

Sudheer is the hero of software Sudhir Movie.

జ‌బ‌ర్‌ద‌స్త్‌తో పాపుల‌ర్ అయిన హాస్య‌ న‌టులలో సుధీర్‌ ఒకరు. జబర్దస్త్ లో సుడిగాడి సుధీర్ పేరుతో చేసిన స్కిట్లు ప్రేక్ష‌కుల్ని బాగా న‌వ్వించాయి. ఈ షో తోనే సుధీర్ బాగా పాపుల‌ర్ అయ్యాడు. అయితే ఇంతకు ముందు ధనరాజ్, షకలక శంకర్ లాగా ఇప్పుడు హీరోగానూ మార‌బోతున్నాడు. సుధీర్ క‌థానాయ‌కుడిగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్‌’ అనే సినిమా తెర‌కెక్కుతోంది.

ధ‌న్యా బాల‌కృష్ణ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఆ సినిమాని రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచ‌ర్ల అనే అయన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. జులైలో విడుద‌ల కానున్న ఆ సినిమా మీద అంచనాలు బానే ఉన్నాయి. జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్ నుంచి చాలామంది వెండి తెర‌పైకొచ్చారు. మ‌రి హీరోగా సుధీర్ సుడి ఎలా ఉందో చూడాలంటే ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి. ”న‌న్ను హీరో అంటున్నారు గానీ, నేను క‌థ‌నే హీరో అనుకుంటున్నా. ఈ క‌థ చెబుతున్నంత సేపూ నేను న‌వ్వుతూనే ఉన్నా. అంత బాగా న‌చ్చింది. ప‌క్కింటి అబ్బాయిలాంటి ఇమేజ్ జ‌బ‌ర్ ద‌స్త్ షో ద్వారా నాకొచ్చింది. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే పోషిస్తున్నానని చెప్పుకొచ్చాడు సుడిగాలి సుధీర్‌