మోహన్‌బాబు… ఇది మరీ ఓవర్‌ బాబు

Mohan Babu Gayathri Movie Song make with 1400 artists

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు చాలా సంవత్సరాల తర్వాత ప్రధాన పాత్రలో ‘గాయత్రి’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. పలు విభిన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మధన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సొంత బ్యానర్‌లో ఈ సినిమాను మోహన్‌బాబు నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఇటీవలే తిరుపతిలో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలో తిరుపతిలో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. రెండవ షెడ్యూల్‌లో ఒక పాటను చిత్రీకరించబోతున్నారు. ఆ పాట సినిమాకే హైలైట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమాలో కీలక సీన్‌లో వచ్చే ఆ పాటను భారీ ఎత్తున చిత్రీకరించబోతున్నట్లుగా చెబుతున్నారు. 1400 మంది పాటలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. వెయ్యి మంది జూనియర్‌ ఆర్టిస్టులతో పాటు, 400 మంది డాన్సర్స్‌తో ఈ పాటను చిత్రీకరించేందుకు దర్శకుడు మదన్‌ ఏర్పాట్లు చేశాడు. ఈ పాట కోసం నిర్మాత మోహన్‌బాబు ఏకంగా 65 లక్షలు ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నాడు. స్టార్‌ హీరోల సినిమాలకు ఈ రేంజ్‌లో ఖర్చు చేయడం అంటే పర్వాలేదు కాని, మోహన్‌బాబు సినిమాను ఈ స్థాయిలో తీసినా, మరే స్థాయిలో తీసినా కూడా చూసేవారు తక్కువే అనే విషయాన్ని గుర్తించాలని, బడ్జెట్‌ను మరీ ఓవర్‌గా కాకుండా లిమిటెడ్‌గా పెడితేనే బాబుకు తర్వాత ఇబ్బందులుండవు అంటున్నారు. మొత్తానికి ఈ పాట గురించి సోషల్‌ మీడియాలో ఇది మరీ ఓవర్‌ బాబు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.