పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి

పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాగా ఎంపీ విజయసాయిరెడ్డి తన అధికారిక సామాజిక మాంద్యమాల ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ఎప్పుడూ ఒకర్ని టార్గెట్ చేస్తూ వాఖ్యానించే ఎంపీ విజయసాయిరెడ్డి, ఇప్పుడు మాత్రం పవన్ ని ఎందుకు ఇంతలా టార్గెట్ చేశారనేది మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి… కాగా ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ని ఇకమీదట పవర్ స్టార్ అనకూడదని, పావలా అనాలని వాఖ్యానించారు. కాగా ” సోషల్ మీడియా సృజన, స్పందించే తీరు ఆశ్చర్యపడేలా ఉంటుంది. పావలాకు బెత్తం స్టార్ అని పేరు పెట్టారు. వైరల్ అయిందీ పేరు. అందుకే అనుకుంటా ఇకపై తనను పవర్ స్టార్ అని పిలవొద్దని పిలుపునిచ్చాడు. ఆలోచనల్లో పరిపక్వత లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడి పరువు గంగలో కలుపుకుంటున్నారు”… అని విజయసాయి రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.