రాజకీయాలలో దుమారం రేపుతున్న వివేకానందా రెడ్డి హత్య

రాజకీయాలలో దుమారం రేపుతున్న వివేకానందా రెడ్డి హత్య

ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్ బాబాయ్ మాజీ మంత్రి వివేకా హత్య రాజకీయాలలో పెద్ద దుమారం రేపింది. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఈ హత్యకు సంబంధించిన దోషులు ఎవరో ప్రభుత్వం ఇంకా భయటపెట్టలేకపోయిందన్న వాదనలు వినిపిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.

ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందులకు చెందిన బీటెక్ రవికి సిట్ విచారణ బృందం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అసలు నిజాలు తెలియాలంటే సీబీఐకీ అప్పగించాలంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు.