భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం

భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం

బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా రెండు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా వచ్చే ఏడాది జులై లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి దర్శక నిర్మాతలు చాలా కష్టపడుతున్నారు. కాగా ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తీ చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ విషయాలను డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు విడుదల చేస్తామని గత కొన్ని రోజులుగా ఒక వార్త ప్రచారంలో ఉంది.

కానీ నిజంగానే ఆ సమయానికి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కి సంబందించిన వివరాలను వెల్లడిస్తారా అనే అనుమానం ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి దర్శకుడు రాజమౌళి తన అన్న కొడుకులు సింహ, కాల భైరవ నటించిన మత్తువదలరా సినిమా ముచ్చట్లు వెల్లడిస్తూ, వారితో ప్రత్యేకమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. కానీ RRR కి సంబందించిన విషయాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. అదీ కాక ఫస్ట్ లుక్ విషయంలో ఈ సినిమాకి సంబంధించిన హీరోలు ఇప్పటివరకు స్పందించలేదనే డౌట్ అందరి మదిని తొలచివేస్తుంది. కాగా ఈ న్యూ ఇయర్ కి RRR ఫస్ట్ లుక్, టైటిల్ ట్రీట్ ఉంటుందా? లేదా? అనే డౌట్ బాగా పెరిగిపోయింది.