మురుగను ఇంకా వదలని సర్కార్ వివాదం…!

Murugadoss Sarkar Movie Controversy

తమిళ స్టార్ హీరో విజయ్, మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సర్కార్ ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకున్నది. తమిళనాడుతో పాటు అంతటా కలిపి ఏకంగా 250 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదాలు తలెత్తుతున్నాయి. మొదట ఈ చిత్రం కథ నాదే అంటూ ఓ రైటర్ కేసు ఫైల్ చేశాడు. చివరికి అతనితో మాట్లాడి, సినిమా స్టార్టింగ్ లో పేరు వేస్తాము అని చెప్పి సర్ది చెప్పారు. తాజాగా సర్కార్ చిత్రంలోన్ని కొన్ని సన్నివేశాలు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు దగ్గర పోలికలు ఉన్నాయి అంటా.

Sarkar Director AR Murugadoss Arrest

తాము ప్రవేశ పెట్టిన పథకాలను, కించ పరిచేలా సినిమా తీశాడు అని ఆ పార్టీ కి చెందినా కొంత మంది పెద్దలు మురగదాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్ మురగదాస్ వాటిని తొలగించడం కూడా జరిగిందంట. ఇంకా అంతటితో శాంతించకుండా మురగదాస్ తో ఓ లెటర్ కూడా రాపించుకున్నారు అంట, భవిష్యత్తులో ఇలాంటి సంగటనలు పునరావృత్తం కాకుండా చూడాలి అని, అందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని రాజకీయ పెద్దలు మురగదాస్ ను డిమాండ్ చేస్తున్నారు. అన్నా డి‌ఎం‌కే నాయకులు కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Sarkar Movie Reached 250 Crore