కారును టెన్షన్ పెడుతున్న చంద్రబాబు !

Telangana polls

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అన్నిపార్టీల అభ్యర్థులు ప్రతీ క్షణం ఓటర్లను ఆకరిష్ణిచేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గులాబీ నేతలు రకరకాల ఎత్తుగడలు వేస్తూ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ప్రజా సభల్లో పాల్గొంటూ మహాకూటమిపై అభాండాలు మోపడమే పనిగా పెట్టుకున్నారు. తమను గెలిపించక పోతే ప్రాజెక్టు నిర్మాణాలు ఆగిపోతాయని, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఓటర్లను సందిగ్ధంలో పడేస్తున్నారు. మరోవైపు మహాకూటమిలోని కీలక నేతలు కూడా ఈ నాలుగు సంవత్సరాలలో గులాబీ నేతలు చేసిన పనులను తెలుపుతూ ప్రజలకు అభివృద్ధి పట్ల జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు.

కారును టెన్షన్ పెడుతున్న చంద్రబాబు ! - Telugu Bullet

ఇదంతా ఇలా ఉంటే ఇక మహాకూటమి తరఫున ప్రచారం చేయటానికి చంద్రబాబు రంగంలోకి దిగటం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. ఈరోజు తేదీలలో తెలంగాణలలో చంద్రబాబు పర్యటన, ఎన్నికల ప్రచారం మరియు ఆయనతో కలిసి రాహుల్ గాంధీ కలిసి రోడ్ చేయబోతున్నారన్న వార్తలు పార్టీలో గుబులు రేపుతున్నాయి. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డం పడుతున్నారని కేసీఆర్ మోపిన అభాండాలపై బాబు ఖచ్చితంగా స్పందించి వివరణ ఇస్తారని టీఆర్‌ఎస్ వర్గాల్లో భయం పట్టుకుందట. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన తమకు బలమైన దెబ్బే అని స్వయంగా పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. ఇదంతా చూస్తుంటే బాబు పర్యటన తర్వాత జరిగే పరిణామాలు వేరేలా ఉంటాయని, రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయి కేవలం ఒకవైపే బలం చేకూరుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సభలు మొదలయ్యాయి పరిస్థితి ఏమిటో వేచి చూడాలి మరి.

కారును టెన్షన్ పెడుతున్న చంద్రబాబు ! - Telugu Bullet