అంబానీ కూతురి గ్రహ శాంతి పూజ తళుక్కు మెరుపులు

అంబానీ కూతురు ఏది చేసినా అంగరంగ వైభోగమే అది ఆమధ్య జరిగిన అంబానీ కూతురి నిశ్చితార్ధ వేడుక అవ్వనీయండి, ఈరోజు జరిగిన గ్రహశాంతి పూజ కానివ్వండి. అంబానీ ఫామిలీ తలుచుకుంటే తమ కూతురి వివాహాన్ని వేరే గ్రహంలో కూడా జరిపించగలదు. అటువంటిది గ్రహాలకు శాంతి పూజ ని కూడా అంత సులువుగా కానివ్వగలదా చెప్పండి. అది చిన్నదో, పెద్దదో కానీ కోట్లు మాత్రం ఖర్చు అవ్వాల్సిందే అని ఒక నియమం ఉంటుందేమో అంబానీ ఫ్యామిలీకి. ఈరోజు జరిగిన గ్రహ శాంతి పూజలో వజ్రవైడూర్య ఆభరణాలతో తళుక్కులీనుతున్న ఇషా అంబానీ ని చూసిన వారందరూ మురిసిపోవాల్సిందే. ఈ పూజ సందర్భంగా ఆమె ధరించిన సవ్యసాచి దుస్తులలో తీసిన ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది ఈ అంబానీ వారసురాలు. ఇషా మెడలో ధరించిన ఆభరణంలో కట్ చేయని సిండికేట్ డైమండ్లు, జాంబియా ఎమెరాల్డ్లని ఉపయోగించారు.

అంబానీ కూతురి గ్రహ శాంతి పూజ తళుక్కు మెరుపులు - Telugu Bullet

తమ నిశ్చితార్ధ వేడుకని ఇటలీలోని లేక్-కోమో లో జరుపుకున్న ఇషా అంబానీ మరియు ఆనంద్ పిరమల్ జంట డిసెంబర్ 12 న ముంబైలో జరుగునున్న కళ్యాణవేడుకలో ఒకటి కాబోతున్నారు. పెళ్ళికి ముందు అంబానీ మరియు పిరమల్ ఫ్యామిలీలు కలిసి వీకెండ్ (డిసెంబర్ 8 మరియు 9 వ తేదీలలో) ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరుపుకోబోతున్నాయి. ఇషా అంబానీ మనసు పడిన ఆనంద్ పిరమల్ కూడా బిలియన్ డాలర్ల పిరమల్ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు. నిన్న మంగళవారం అంబానీ మరియు పిరమల్ కుటుంబాలు కలిసి తిరుమల ని సందర్శించి ఇషా అంబానీ – ఆనంద్ పిరమల్ వివాహ ఆహ్వాన పత్రికని శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఇచ్చివచ్చారు.

image.png