నాగచైతన్యకు పెను ప్రమాదం తప్పింది!

Naga Chaitanya escape Intelligent Movie Chance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కొన్ని సార్లు ఒక హీరో చేయాల్సిన కథ మరో హీరో వద్దకు వెళ్తాయి. అలా పలువురు స్టార్‌ హీరోలు సూపర్‌ హిట్‌ చిత్రాలను మిస్‌ అయినట్లుగా మీడియాలో వార్తలు చూస్తూనే ఉంటాం. అలాగే అట్టర్‌ ఫ్లాప్‌ అయిన కథలు కూడా ఒక హీరో నుండి మరో హీరోకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. సూపర్‌ హిట్‌ అయిన చిత్రాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కనుక ఫ్లాప్‌ ఏ హీరో నుండి ఏ హీరోకు బదిలీ అయ్యింది అనే విషయాను పట్టించుకోం. తాజాగా మాత్రం నాగచైతన్యకు పడాల్సిన అట్టర్‌ ఫ్లాప్‌ సాయి ధరమ్‌ తేజ్‌కు పడ్డది. ఇంటిలిజెంట్‌ చిత్రాన్ని మొదట నాగచైతన్యతో చేయాలని వినాయక్‌ భావించాడని, కాని సాయి ధరమ్‌ తేజ్‌ పట్టుబట్టి మరీ ఆ చిత్రాన్ని చేశాడని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాగచైతన్య ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చేస్తున్న సమయంలో సి కళ్యాణ్‌తో ఒక చిత్రాన్ని చేసేందుకు డేట్స్‌ ఇచ్చాడు. ఆ డేట్స్‌తో వినాయక్‌ దర్శకత్వంలో ఇంటిలిజెంట్‌ చిత్రాన్ని నిర్మించాలని సి కళ్యాణ్‌ భావించాడు. రచయిత ఆకుల శివ కథ చెప్పిన తర్వాత చైతూ ఆలోచనల్లో పడ్డాడు. ఆ సమయంలోనే ఆ ప్రాజెక్ట్‌ను తాను చేస్తాను అని, వినాయక్‌ దర్శకత్వంలో చేయాలనే కోరిక ఉందని నిర్మాత కళ్యాణ్‌ వద్ద చెప్పడం, వెంటనే ప్రాజెక్ట్‌ షిఫ్ట్‌ అవ్వడం జరిగి పోయింది. లేదంటే నాగచైతన్య కెరీర్‌లో మరో పెద్ద డిజాస్టర్‌ పడేదని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని చేస్తున్న చైతూ కెరీర్‌ మెల్లగా, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇంటిలిజెంట్‌ చైతూ చేసి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.