చైతూ ఓటు శైలజరెడ్డికే దక్కింది

Sailaja Reddy Alludu and Savyasachi Movie release dates

అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ మరియు ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో మొదట అనుకున్న ప్రకారం అయితే సవ్యసాచి విడుదల చేయాల్సి ఉంది. ఆగస్టు రెండవ వారంలో సవ్యసాచిని చివరి వారంలో శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కాని అనూహ్య పరిణామాల నేపథ్యంలో మొదట శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సవ్యసాచి చిత్రం గత ఆరు నెలలుగా విడుదల అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు విడుదల చేస్తారని భావిస్తున్న సమయంలో చైతూ కోరిక మేరకు శైలజ రెడ్డి అల్లుడు చిత్రం తర్వాత విడుదల చేయాలని సవ్యసాచి నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

శైలజ రెడ్డి అల్లుడు చిత్రంకు మారుతి దర్శకత్వం వహించాడు. అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా నటించగా రమ్యకృష్ణ అత్త పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. శైలజ రెడ్డిపై ఉన్నంత పాజిటివ్‌ బజ్‌ సవ్యసాచిపై లేదని చెప్పాలి. అందుకే మొదటగా శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని విడుదల చేస్తే, ఆ సినిమా సక్సెస్‌ అయితే అప్పుడు సవ్యసాచికి మంచి క్రేజ్‌ వస్తుందనే ఉద్దేశ్యంతో నాగచైతన్య మొదట శైలజ రెడ్డి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. అందుకే నిర్మాతలు కూడా తమ చిత్రాల విడుదల రీ షెడ్యూల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. శైలజ రెడ్డి చిత్రాన్ని అదే తేదీ లేదా వారం ముందుకు తీసుకు రావడం సవ్యసాచి చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.