మేనేజ్మెంట్ సభ్యుల ప్రవర్తన నచ్చక బయటకు వచ్చిన నాగబాబు

మేనేజ్మెంట్ సభ్యుల ప్రవర్తన నచ్చక బయటకు వచ్చిన నాగబాబు

ప్రస్తుతం బుల్లితెరపై మంచి పేరుతో అలానే రేటింగ్స్ తో దూసుకుపోతున్న క్రేజీ షో జబర్దస్త్ నుండి జడ్జీగా వ్యవహరిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు, అందులోని కొందరు మేనేజ్మెంట్ సభ్యుల ప్రవర్తన నచ్చక బయటకు వచ్చినట్లు ఇటీవల ఒక వీడియో ద్వారా తెలిపారు. అయితే తనకు ఏడేళ్లుగా మంచి సపోర్ట్ ని అందించిన మల్లెమాల వారికి మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెల్పిన నాగబాబు, ఆ తరువాత జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న అదిరింది అనే షోకు జడ్జిగా వ్యవహరించడానికి సిద్ధం అయ్యారు. ఇక ఇటీవల మంచి క్రేజ్ తో ప్రారంభం అయిన ఈ షోలో, జబర్దస్త్ నుండి నాగబాబుతో కలిసి బయటకు వచ్చిన చమ్మక్ చంద్ర సహా మరికొందరు యువ పార్టిసిపెంట్స్ పాల్గొంటున్నారు.

కొద్దిరోజులుగా సాగుతున్న ఈ షోకు కూడా ప్రేక్షకాదరణ బాగానే వస్తోందని భావించిన జబర్దస్త్ షో నిర్వాహకులు, తమ షోలో కూడా మరింతగా నవ్వులు పూయించేలా మరికొందరు పార్టిసిపెంట్స్ కు అవకాశం కల్పించారు. మంచి పోటా పోటీగా సాగుతున్న ఈ రెండు షోలకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన తాజా రేటింగ్స్ ని పరిశీలించగా, జబర్దస్త్ కు 5 నుండి 6 రేటింగ్స్ రాగా, అదిరింది షోకు కేవలం 0.5 రేటింగ్స్ మాత్రమే లభించడంతో, జడ్జి నాగబాబు సహా షో నిర్వాహకులు అందరూ కొంత ఆలోచనలో పడ్డారట. దీనితో జబర్దస్త్ కు మరొక్కసారి ఎదురు లేకుండా పోయిందని అంటున్నారు విశ్లేషకులు.

అయితే తాను భావించినట్లుగా కాకుండా, అదిరింది షో కు ఎంతో తక్కువ స్థాయిలో రేటింగ్స్ రావడంతో షాకైన నాగబాబు, ఈ షో నుని తప్పుకోవాలని చూస్తున్నారని, నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. కేవలం ఆ షో నుండి మాత్రమే కాక ఆయన పూర్తిగా బుల్లితెర నుండి తప్పుకుని ఇకపై జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమవ్వాలని కూడా భావిస్తున్నట్లు టాక్.