బ్రేక్‌ తీసుకుంటున్న నాగ్‌.. ఎందుకో తెలుసా?

Nagarjuna decided to take a gap for son Akhil,

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కింగ్‌ నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం తర్వాత కమిట్‌ అయిన ‘రాజుగారి గది 2’ చిత్రం దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల రీ షూట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో ‘రాజుగారి గది 2’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు. ఎప్పుడైనా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసే నాగార్జున ఈసారి మాత్రం గ్యాప్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘రాజుగారి గది 2’ చిత్రం విడుదలైన తర్వాత వెంటనే తర్వాత సినిమాకు కమిట్‌ అవ్వడని తెలుస్తోంది. తన చిన్న కొడుకు అఖిల్‌ కోసం నాగార్జున గ్యాప్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అఖిల్‌ మొదటి సినిమా భారీ డిజాస్టర్‌ అయ్యింది. దాంతో రెండవ సినిమాను స్వయంగా తానే నిర్మించాలని నాగార్జున భావించాడు. అఖిల్‌ రెండవ సినిమా ఇప్పటికే విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది. ఆ సినిమా నిర్మాణ కార్యక్రమాలను దగ్గర ఉండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతోనే నాగార్జున తన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్‌ రెండవ సినిమా పూర్తి అయిన తర్వాత నాగార్జున తర్వాత సినిమాకు కమిట్‌ అవుతాడని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న ‘రాజుగారి గది 2’ చిత్రంలో నాగార్జున ఒక విభిన్న తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.