అబద్ధం మీద అంతులేని నమ్మకం.

nithin hanu raghavapudi hopes on lie movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
” లై”… యంగ్ హీరో నితిన్ తో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం మీద హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా. ఈ సినిమా మేకింగ్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. దాదాపు 75 రోజుల పాటు అమెరికా లో షూటింగ్ ముగించుకొచ్చిన లై బడ్జెట్, సబ్జెక్టు గురించి అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. నితిన్ మీద 30 నుంచి 40 కోట్లు ఖర్చుబెట్టి సినిమా తీయాలంటే మాటలు కాదు. చాలా ధైర్యం కావాలి. అటు దర్శకుడు హను రాఘవపూడి కూడా హిట్ ఇచ్చాడు కానీ భారీ హిట్ లు ఇవ్వలేదు. ఇదే విషయాన్ని కొందరు అడిగితే నిర్మాత అనిల్ సుంకర కూల్ గా సబ్జెక్టు మీద వున్న నమ్మకంతో పని చేస్తున్నామని ఆత్మవిశ్వాసంతో చెప్పారట.

లై గురించి ఆ సినిమా నిర్మాతలే కాదు ఆ స్టోరీ తెలిసిన వాళ్ళు కూడా అదే నమ్మకంతో వున్నారు. ఇక సినిమాలో పనిచేస్తున్న వారి గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. హీరో నితిన్ అ ఆ తో వచ్చిన విజయాన్ని నిలుపుకోడానికి ఆచితూచి ఈ సబ్జెక్టు ఎంచుకున్నాడు. ఒక్కసారి కూడా ఈ సినిమా ఏమి అవుతుందో అన్న అనుమానం వ్యక్తం చేయలేదట. ఎంత బాగా చేద్దాం అన్నదానిపైనే చర్చించాడట. ఇక విలన్ గా చేస్తున్న అర్జున్ అయితే లై మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ తో వున్నాడట. ఈ సినిమాతో కెరీర్ ఇంకోసారి కొత్త పుంతలు తొక్కుతుందని నమ్మకంతో వున్నాడట. ఇక వీరిని ఒప్పించిన దర్శకుడు హను అయితే ఈ కథ, సినిమా తనకు స్పెషల్ గా నిలిచిపోతుందని ఘంటాపధంగా చెబుతున్నారట. ఇవన్నీ చూసాక లై అంటే అబద్ధం మీద అంతులేని నమ్మకం కుదరడం లేదా! అల్ ది బెస్ట్ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్.