పడి పడి లేచె మనసు ట్రైలర్ : కరెక్ట్ కాదేమో…!

Padi-Padi-Leche-Manasu-Thea

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ – సాయిపల్లవి జంటగా ‘పడి పడి లేచె మనసు’ నిర్మితమైంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. “నా పేరు సూర్య .. పేరులోని వెలుగు జీవితంలో మిస్సై సంవత్సరం అవుతోంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బతికున్నానంటే కారణం వైశాలి” అంటూ శర్వానంద్ వాయిస్ పై ట్రైలర్ మొదలవుతోంది. తర్వాత ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సీన్లు కొన్ని ఉంటాయి. అయితే ఈ ఇద్దరి డైలాగ్స్ ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని పెంచుతున్నాయి. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనిపిస్తోంది. మీరు కూడా ఒక లుక్కు వేసెయ్యండి మరి.