వర్మ సినిమాలో నాగ్‌ లుక్‌ రచ్చ…

Nagarjuna first look in Ram Gopal Varma Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల వరుసగా తన పేరుకు తగ్గట్లుగా వివాదాస్పద చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈయన చేసిన పలు సినిమాలు పెద్ద వివాదాలను మూట కట్టుకున్న విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత తెలుగులో వర్మ ఒక పెద్ద హీరోతో, ఒక పెద్ద సినిమాను తీసేందుకు సిద్దం అయ్యాడు. ఇన్నాళ్లు వర్మ చేస్తున్న సినిమాలు వివాదాస్పదం అవుతూ, ప్రయోగాత్మకంగా ఉంటూ వచ్చాయి. కాని ఇప్పుడు వర్మ చేస్తున్న సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 28 సంవత్సరాల క్రితం నాగార్జునతో వర్మ శివ చిత్రాన్ని చేసి దర్శకుడిగా జర్నీ మొదలు పెట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది.

Nag-Different-looks-in-RGV-

 

తాజాగా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయిన నాగార్జున, వర్మ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో అంచనాలను రేకెత్తిస్తోంది. వర్మ తానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నేడు షూటింగ్‌ ప్రారంభం సందర్బంగా చిత్రంలోని నాగార్జున లుక్‌ను రివీల్‌ చేశారు. ఇప్పటికే నాగ్‌ ఈ చిత్రంలో పోలీస్‌గా కనిపిస్తాడని తేలిపోయింది. తాజాగా విడుదలైన పోస్టర్స్‌తో నాగ్‌ ఏ స్థాయిలో దుమ్ము రేపబోతున్నాడో అర్థం అవుతుంది. చాలా కాలం తర్వాత నాగ్‌ ఒక మంచి లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా నాగ్‌ లుక్‌ రచ్చ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్‌ లుక్‌తోనే వర్మ సగం సక్సెస్‌ను దక్కించుకున్నాడు. మిగిలిన సగం సక్సెస్‌ను తన క్రియేటివిటీ మరియు తన టేకింగ్‌తో దక్కించుకుంటాడని సినీ వర్గాల వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.