పిక్‌టాక్‌ : ఇన్నాళ్లకు కనిపించిన వారసుడు

Nandamuri mokshagna new photo viral in social media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా మోక్షజ్ఞ రావాలని కోరుకుంటున్నారు. తాతకు తగ్గ మనవడిగా, జూనియర్‌ ఎన్టీఆర్‌కు సరి పోటీగా మోక్షజ్ఞ నిలవాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. గత కొంత కాలంగా బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ఎట్టకేలకు మోక్షజ్ఞ సినిమా వచ్చే సంవత్సరం ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చాడు. 

గత రెండు మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయాలపై నందమూరి ఫ్యామిలీ నోరు మెదపలేదు. రెండు మూడు సంవత్సరాలుగా కూడా మోక్షజ్ఞ కొత్త ఫొటోలు ఏవీ కూడా సోషల్‌ మీడియాలో లేదా ఇంటర్నెట్‌లో కనిపించలేదు. అసలు ఇప్పుడు మోక్షజ్ఞ ఎలా తయారు అయ్యాడో తెలియక నందమూరి ఫ్యాన్స్‌ కాస్త గందరగోళం మరియు ఉత్సాహంతో ఉన్నారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ కనిపించాడు. తాజాగా సోషల్‌ మీడియాలో కనిపించిన ఈ ఫొటో ప్రస్తుతం ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఒక పక్కా మాస్‌ హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్ని కూడా మోక్షజ్ఞలో ఉన్నాయంటూ అభిమానులు సంతోషిస్తున్నారు. వచ్చే సంవత్సరం సినిమా ప్రారంభం అయితే 2019లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మోక్షజ్ఞ సినిమా కోసం ఇంకా దాదాపు రెండు సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే.

మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం… తెలుగు బులెట్ రివ్యూ

కుశ టీజర్‌ వచ్చేసింది …ఎన్టీఆర్ అదుర్స్

మేడ మీద అబ్బాయి… తెలుగు బులెట్ రివ్యూ