అర్జున్‌రెడ్డి …శ్రావ్యరెడ్డికి స్ట్రాంగ్‌ రీప్లే

Vijay Devarakonda Strong Reply To Sravya Reddy Controversy Comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Vijay Devarakonda Strong Reply To Sravya Reddy Controversy Comments

తెలుగు సినీ పరిశ్రమ వర్గాల్లో మరియు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో గత కొన్ని రోజులుగా ‘అర్జున్‌ రెడ్డి’ చర్చ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్‌ రెడ్డి సూపర్‌ అంటూ కొందరు, అర్జున్‌ రెడ్డి చెత్తగా ఉందని కొందరు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక సినిమాకు ఇలాంటి టాక్‌ రావడం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. కొందరు పర్వాలేదు అంటే కొందరు బాగాలేదు అనడం, లేదా కొందరు బాగుంది అంటే కొందరు పర్వాలేదు అనడం చూశాం. కాని కొందరు సినిమా పరమ చెత్త అంటుంటే మరి కొందరు మాత్రం సినిమా ట్రెండ్‌ సెట్‌ చేసింది, అద్బుతంగా ఉందని అంటున్నారు. ఇలాంటి చర్చలోకి శ్రావ్యరెడ్డి అనే ఒక నటి వచ్చింది. ఎక్కువ శాతం సోషల్‌ మీడియాలో కాకుండా మామూలుగా స్నేహితులతో మాట్లాడుకుంటున్నారు. కాని శ్రావ్యరెడ్డి మాత్రం పాయింట్‌ టు పాయింట్‌ చెబుతూ సినిమా చెత్తగా ఉందని, తలనొప్పి సినిమా అంటూ తేల్చిపారేసింది. 

శ్రావ్యరెడ్డి తలనొప్పి విమర్శలకు అర్జున్‌రెడ్డి చిత్ర యూనిట్‌ సభ్యులు కాస్త ఘాటుగానే స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో శ్రావ్యరెడ్డి విమర్శలకు సమాధానం చెప్పిన చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా శ్రావ్యరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఆమె సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. విజయ్‌ దేవరకొండ స్వయంగా శ్రావ్యరెడ్డికి ఫోన్‌ చేసి కాస్త సీరియస్‌గా మాట్లాడాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. శ్రావ్యరెడ్డి ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు కాని, సన్నిహితులతో చర్చించినట్లుగా చెబుతున్నారు. అర్జున్‌ రెడ్డి హీరో కాస్త దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి ఫోన్‌ చేసి కూడా ఉంటాడు అని కొందరు అంటున్నారు. మొత్తానికి శ్రావ్యరెడ్డి ఇష్యూతో మళ్లీ ఎవరు కూడా అర్జున్‌ రెడ్డి గురించి నోరు ఎత్తేందుకు ఆసక్తి చూపించడం లేదు.

మరిన్ని వార్తలు: