అర్జున్‌రెడ్డి తలనొప్పి సినిమా : శ్రావ్యరెడ్డి

shravya reddy comments on Arjun Reddy movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉండే శ్రావ్యరెడ్డి తాజాగా విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. విజయ్‌ దేవరకొండ, షాలినిపాండే జంటగా సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా సూపర్‌ డూపర్‌ అంటూ, ట్రెండ్‌ సెట్టర్‌ సినిమా అంటూ సినీ ప్రముఖులైన రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, అనుష్క, మహేష్‌బాబు వంటి వారు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ సినిమా చెత్త సినిమా అంటూ మొత్తుకుంటున్నారు. ఇది యూత్‌ను చెడగొట్టే సినిమా అని, ఇలాంటి సినిమాలను ఆధరిస్తే ముందు ముందు ఇలాంటి బూతు సినిమాలు ఇంకా చాలా వస్తాయని కొందరు అంటున్నారు. శ్రావ్య రెడ్డి ఈ సినిమాకు బ్యాడ్‌ కామెంట్స్‌ చేసింది.

ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి అనే టైటిల్‌ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. హీరో పేరు అర్జున్‌రెడ్డి దేశ్‌ముఖ్‌ అని సినిమాలో చెప్పారు. దేశ్‌ముఖ్‌ అయినప్పుడు రెడ్డి ఎలా అవుతాడో వారు చెప్పాలి. ఇక హీరోయిన్‌ ఏమాత్రం యాక్టింగ్‌ రాని అమ్మాయిగా అనిపించింది. అన్ని సీన్స్‌లలో ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టింది. దర్శకుడు ఈ సినిమాలో ప్రేమిస్తే ఏదైనా కోల్పోవాలి, అప్పుడే ఆ ప్రేమ దక్కుతుంది అనే సందేశాన్ని ఇచ్చినట్లుగా అనిపించింది. యువతకు ఇలాంటి సందేశాలేనా ఇచ్చేది అంటూ శ్రావ్య రెడ్డి ఫైర్‌ అవుతుంది. ఇటీవలే అనుష్క చాలా తీవ్రస్థాయిలో అర్జున్‌రెడ్డిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు శ్రావ్య రెడ్డి కూడా విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఇలాంటి మిశ్రమ స్పందన రాలేదని సినీ ప్రముఖులు సైతం అంటున్నారు.

మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం… ప్రివ్యూ

మేడ మీద అబ్బాయి… ప్రివ్యూ.

అవ‌న్నీ వ‌ట్టి పుకార్లే