మేడ మీద అబ్బాయి… ప్రివ్యూ.

meda meeda abbayi Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   అల్లరి నరేష్ , నిఖిల విమల్ , అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది , సత్యం రాజేష్ 
నిర్మాత :     బొప్పన చంద్రశేఖర్
దర్శకత్వం :    ప్రజీత్
మ్యూజిక్ డైరెక్టర్ :  షాన్ రెహమాన్ 
ఎడిటర్ :     నందమూరి హరి 
సినిమాటోగ్రఫీ : కుంజుని ఎస్. కుమార్  

“మేడ మీద అబ్బాయి”… తెలుగు దన౦ వుట్టిపడుతున్న ఈ టైటిల్ వింటే పాత సినిమా పేర్లు గుర్తుకు వస్తాయి. టైటిల్ కాస్త పాత అనిపిస్తున్నప్పటికీ సరికొత్త కథ, కథనాలతో ఈ సినిమా రాబోతోంది. హీరో అల్లరి నరేష్ సేఫ్, సేఫ్ అనుకుంటూ రొటీన్ సినిమాలు చేసిచేసి, వైఫల్యాలతో విసిగిపోయి వున్న టైం లో ఆయన ముందుకు వచ్చిన కథ ఇది. ఈ చిత్ర నిర్మాత బొప్పన చంద్రశేఖర్ గతంలో నరేష్ తో కొన్ని హిట్ సినిమాలు చేశారు. ఆ చనువు, చొరవతో కొత్తదనం వున్న సినిమా చేద్దామని నిర్మాత స్వయంగా హీరో నరేష్ దగ్గర ప్రతిపాదించారు. అప్పుడే వారి దృష్టిలో మలయాళం సినిమా “ఓరు వడక్కన్ సెల్ఫీ” మీద పడింది. నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలతో అల్లుకున్న ఈ కథ లో కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్ కూడా ముడిపడి ఉండేలా దర్శకుడు ప్రజీత్ కధనం రాసుకున్నాడు.

అల్లరి నరేష్, బొప్పన చంద్రశేఖర్ నమ్మకం ఉంచిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది.ఇప్పుడు అదే కథ, దర్శకుడితో “మేడ మీద అబ్బాయి ” గా రాబోతున్నాడు నరేష్. స్పూఫ్ కామెడీ తో విసిగిపోయిన నరేష్ ఈ సినిమాతో తన కెరీర్ కొత్త దారిలోకి వెళుతుందని విశ్వాసంతో వున్నారు. ఇక దర్శకనిర్మాతలు కూడా ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సోషల్ మీడియా ప్రభావాన్ని కొత్త కోణంలో చూపించే ఈ కథ, సినిమా అల్లరి నరేష్ కి సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం.


మరిన్ని వార్తలు:

మోక్షజ్ఞ లవ్ స్టోరీ కి అతనే కర్త,కర్మ,క్రియ ?

బాలయ్యకు ఎలా పిలిస్తే ఇష్టమో తెలుసా?

దేవసేన కూడా అర్జున్‌ రెడ్డి అభిమాని